NTV Telugu Site icon

Jr NTR: టీడీపీ ర్యాలీలో ఎన్టీఆర్ కి పాలాభిషేకం

Jr Ntr N 1200by667 1200x768

Jr Ntr N 1200by667 1200x768

Palabhishekam for Jr NTR Flexi at Chittor: సరిగ్గా మరో 13 రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణలో సైతం ఎన్నికల జరగబోతున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తో పాటు లోక్ సభ ఎన్నికలు జరగబోతూ ఉండగా తెలంగాణలో కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం దాదాపు అన్ని పార్టీలు తమ స్థాయికి మించి కష్టపడుతున్నాయి. ఏపీలో అయితే మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార వైసిపి ప్రజల్లోకి వెళ్తుంటే జనసేన, టిడిపి, బిజెపి కలిసి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల విషయంలో సైలెన్స్ పాటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం అభిమానులు వదలడం లేదు. ఆ మధ్య కొడాలి నాని నామినేషన్ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు హల్చల్ చేయగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి ఏకంగా పాలాభిషేకం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Nakkina Trinadh Rao: దర్శకుడు నక్కిన త్రినాధరావు ఇంట తీవ్ర విషాదం

అయితే ఇది చిత్తూరులో జరిగిన టిడిపి ర్యాలీ అని చెబుతున్నారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వార్ 2 సినిమా షూటింగ్లో బిజీబిజీగా జరుగుతున్నాడు. అందుకోసం భార్యతో కలిసి ముంబై వెళ్ళిన ఆయన మధ్య మధ్యలో మీడియా కంట పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ప్రకటనలు గాని తెలుగుదేశానికి ఓటు వేయమని కానీ చెప్పలేదు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటే మరి కొంత మంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. గతంలో ఇదే విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ అభిమానం వేరు రాజకీయం వేరు అని చెప్పుకొచ్చారు. తన అభిమానులు ఏ పార్టీలో అయినా ఉండవచ్చు కానీ వారందరూ తెలుగుదేశం అయ్యుండాలని అనడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు.

Show comments