P Pullaiah: ఈ రోజున అత్యధిక సంఖ్యలో కన్నవారు తమ పిల్లలు తమను ‘మమ్మీ’, ‘డాడీ’ అంటూ పిలవాలని తపించిపోతున్నారు. అందుకు తగ్గట్టుగా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడయమ్ స్కూల్స్‌లోనే చదివిస్తున్నారు. చిత్రసీమ తొలి రోజుల్లోనే అలా పలువురి చేత ‘మమ్మీ-డాడీ’ అని పిలిపించుకొని ఆనందించారు దర్శకనిర్మాత పి.పుల్లయ్య, ఆయన సతీమణి శాంతకుమారి. అలా పిలిపించుకోవడమే కాదు, నిజంగానే పలువురికి అండగా నిలచి, ఆదుకున్నారు ఆ దంపతులు. ఈ భార్యాభర్తల మధ్య సరసం కూడా అలాగే ఉండేది. కోపం వస్తే చాలు పి.పుల్లయ్య అగ్గిమీద గుగ్గిలమైపోయి తనకు తెలిసిన ‘బూతులన్నీ’ వల్లించే దాకా శాంతించేవారు కారు. ఇక శాంతకుమారి పేరుకు తగ్గట్టే శాంతమూర్తి. భర్త తీరు తెలిసిన శాంతకుమారి ఆయన శాంతించే దాకా పన్నెత్తు మాటనే వారు కారు. అంతా సద్దుమణిగాక, “అంత ఆయాసపడడం ఎందుకూ!?” అనేవారు. దాంతో పుల్లయ్య కూడా “ఈ పాడు కోపం…” అంటూ మళ్ళీ రెండు మూడు బూతులు తనను తాను తిట్టుకున్నాకే స్తిమితపడేవారట!
Gangula Kamalakar: రైతులు అధైర్యపడొద్దు, తడిచిన ధాన్యాన్ని కొంటాం.. మంత్రి గంగుల హామీ
తాను దర్శకత్వం వహించే చిత్రాలలో తప్పకుండా భార్య శాంతకుమారికి తగిన పాత్రలు ఇచ్చేవారు. తాను తీసిన ‘బాలాజీ’ (శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం)లో శాంతకుమారిని పద్మావతిగా నటింపచేశారు. తరువాత అదే కథతో 1960లో ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’గా తెరకెక్కించిన సమయంలో శాంతకుమారిని అందులో వకుళమాత పాత్రలో చూపించారు. ఇలా తన అర్ధాంగికి తగ్గ పాత్రలలోనే ఆమెను నటింపచేశారు పుల్లయ్య.
Raghunandan Rao: ఓఆర్ఆర్ లీజ్‌లో కుట్ర ఉంది.. ఆ 16 రోజుల్లో ఏం జరిగింది?
అన్నట్టు పి.పుల్లయ్య తీసిన ‘అర్ధాంగి’ సమయంలోనూ ఈ దంపతుల సరసం గురించి ఇప్పటికీ భలేగా చెప్పుకుంటారు. పుల్లయ్య ‘అర్ధాంగి’ చిత్రం తెరకెక్కించే రోజుల్లో ఏయన్నార్ ను ప్రధాన పాత్రకు, అందులో ప్రతినాయక పాత్రను పోలిన పాత్రలో జగ్గయ్యను ఎంపిక చేసుకున్నారు. ఇక వారి తల్లిగా శాంతకుమారిని ఎంచుకున్నారు. ఆమెకు తగ్గ భర్త పాత్రధారి కోసం అన్వేషించసాగారు పుల్లయ్య. ఆ క్రమంలో రోజుకో నటుణ్ణి తీసుకు వచ్చి “ఏమేవ్… నీకు మొగుణ్ణి పట్టుకు వచ్చాను ఇలా రా…చూద్దువు…” అనేవారు. ఆ సినిమాకు ఆ దంపతులు నిర్మాణబాధ్యతలూ నిర్వహించడంతో శాంతకుమారి సైతం నటీనటుల ఎంపికలో పాల్గొనేవారు. తన సరసన నటించడానికి పనికి రాడని భావిస్తే “అబ్బే…” అనేవారు శాంతకుమారి. చివరకు గుమ్మడిని ‘అర్ధాంగి’లో శాంతకుమారి భర్త పాత్రకు తెచ్చారు. గుమ్మడిని ఎగాదిగా చూసి, ఇతను మరీ చిన్నపిల్లాడిలా ఉన్నాడండీ అంటే – నిజమే మరి నాగేశ్వరరావు కంటే చిన్నవాడే అని పుల్లయ్య చెప్పారట. “మరింకెందుకు…?” అన్నారట శాంతకుమారి. ‘వయసుతో పనేముందే… నటనలోనే ఉంది… ఇతనే నీకు మొగుడు… ఇది ఫైనల్’ అన్నారట. “మీ మాటలకు ఆ అబ్బాయి కంగారు పడేట్టున్నాడు… ఏమనుకోమాకు బాబూ… మా ఆయన ఎప్పుడూ అంతే…” అని శాంతకుమారి చెప్పారట. ఈ విషయాన్ని గుమ్మడి పదే పదే చెప్పేవారు. ‘అర్ధాంగి’లో నటించిన తరువాతే నాయికానాయకులకు తండ్రి పాత్రల్లో గుమ్మడి బిజీ కావడం విశేషం!