OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్

Ott Releases Thisweek

Ott Releases Thisweek

OTT Releases This Week : ఈ వారం అనేక క్రేజీ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. హారర్ కామెడీ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు, రియాలిటీ షో నుంచి ఫ్యామిలీ ఎమోషన్ కథల వరకు విభిన్నమైన కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. థియేటర్లకు వెళ్లలేకపోయిన ప్రేక్షకులకు కూడా ఇప్పుడు ఈ చిత్రాలను ఇంటి నుంచే ఆస్వాదించే అవకాశం దక్కబోతోంది. డిజిటల్ ప్రపంచంలో మీ ముందుకు ఏమేమి రాబోతున్నాయో ఒకసారి చూద్దాం.

కరుప్పు (Karuppu)

తమిళ స్టార్ సూర్యకు చాలా కాలం తర్వాత ఘన విజయాన్ని అందించిన చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూర్య కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఆర్.జె. బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించింది. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ అంశాల సమ్మేళనంగా నిలిచిన ఈ చిత్రం జూన్ 12 నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.

×
×
Ad

రాఖ్ (Raakh)

క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ‘రాఖ్’ బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఇద్దరు టీనేజర్ల అదృశ్యం, హత్యల చుట్టూ తిరిగే ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలో అలీ ఫజల్, సోనాలి బెంద్రే ప్రధాన పాత్రలు పోషించారు. రాకేష్ బేడి, అమీర్ బషీర్, ఆకాష్ మఖిజా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 12 నుంచి ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.

మా హై నా (Maa Hai Na)

ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ‘మా హై నా’ అనే కొత్త రియాలిటీ కుకింగ్ షో కూడా సిద్ధమైంది. ప్రముఖ నటి శిల్పా శెట్టి హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో జెన్ జెడ్ సెలబ్రిటీలు తమ తల్లులతో కలిసి పాల్గొంటారు. వంటల పోటీలు, సరదా సంఘటనలు, భావోద్వేగ క్షణాలతో ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది జూన్ 12 నుంచి ZEE5లో ప్రసారం కానుంది.

డ్రిడమ్ (Dridam)

మలయాళ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న ‘డ్రిడమ్’ కూడా ఈ వారం ఆసక్తికరమైన విడుదలల్లో ఒకటిగా నిలుస్తోంది. నేరాలు దాదాపు జరగని ప్రశాంతమైన పట్టణంలో ఒక షాకింగ్ సంఘటన జరిగాక అక్కడి పోలీస్ వ్యవస్థ ఎలా కుదేలవుతుందనే నేపథ్యంలో ఈ థ్రిల్లర్ రూపొందింది. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ నిర్మించిన ఈ చిత్రానికి మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించగా, షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించారు. జూన్ 12 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

తార్కట (Taarkata)

బెంగాలీ ప్రేక్షకుల కోసం ‘తార్కట’ అనే వెబ్ సిరీస్ కూడా రానుంది. ప్రతీకారం, యాక్షన్, డార్క్ హ్యూమర్ థీమ్స్ తో రూపొందిన ఈ సిరీస్‌లో మెయాంగ్ చాంగ్, ప్రియాంక సర్కార్, శ్రీజిత్ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ కూడా జూన్ 12 నుంచే ZEE5లో అందుబాటులోకి రానుంది.

భూత్ బంగ్లా (Bhooth Bangla)

చాలా కాలం తర్వాత ప్రియదర్శన్, అక్షయ్ కుమార్‌ల కలయికతో ‘భూత్ బంగ్లా’ రూపొందింది. ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 250 కోట్ల గ్రాస్‌తో భారీ విజయం సాధించింది. ఈ చిత్రం జూన్ 12 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. పరేష్ రావల్, టబు, వామికా గబ్బి, జిషు సేన్‌గుప్తా, దివంగత అశ్రాని గారు, మిథిలా పాల్కర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.