NTV Telugu Site icon

Utsavam: ప్రైమ్ వీడియోలో ఆకట్టుకుంటున్న ఉత్సవం

Utsavam

Utsavam

Utsavam Receives Unanimous Positive Response On Amazon Prime: దసరా సందర్భంగా థియేటర్ లో, ఓటీటీలో కొత్త చిత్రాల సందడి కనిపిస్తుంది. ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన ఎమోషనల్ డ్రామా, సందేశాత్మక చిత్రమైన ‘ఉత్సవం’ ఓటీటీలోకి వచ్చింది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా , రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధా వంటి భారీ తారాగణంతో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెలలో థియేటర్లోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అంతరించి పోతోన్న నాటక రంగం గురించి, వాటితో ముడిపడి ఉన్న ఎమోషన్స్‌ను, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా కథనంతో అద్భుతంగా చూపించారు.

ఎమోషనల్, యూత్ ఫుల్ లవ్ డ్రామాగా వచ్చిన ఉత్సవం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 11న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. రసూల్‌ ఎల్లోర్‌ సినిమాటోగ్రఫీ, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం ఉత్సవం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరి ఓటిటీ ఆడియెన్స్‌ కోసం ఉత్సవం మూవీ వచ్చేసింది. ఇక్కడి ఆడియెన్స్ ఉత్సవం‌ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేలా ఉన్నారు. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా , రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.

Show comments