టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటు తెలుగు అటు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగులో ప్రస్తుతం నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో ‘మజాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరెకెక్కిన ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అటు తమిళ్ లో స్టార్ హీరో విజయ్ విజయ్ కొడుకు జాసన్ విజయ్ డెబ్యూ డైరెక్షన్ మూవీలోను సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ కిషన్ ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇంటెర్నేషల్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తొలి సారిగా స్ట్రయిట్ తెలుగు వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. Next On Netflix India సిరీస్‌లో భాగంగా ‘సూపర్ సుబ్బు’ టైటిల్ తో వస్తోంది. ఈ వెబ్ కు టిల్లు 2 దర్శకుడి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. సెన్సిటివ్ టాపిక్ అయిన సెక్స్ ఎడ్యుకేషన్ కథా నేపథ్యంలో ఈ సిరీస్ రానున్నట్టు తెలుస్తోంది. హీరో సందీప్ కిషన్.. కామేడి కింగ్ బ్రహ్మనందం ప్రధాన పాత్రలో నటిస్తుండగా మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ శర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‌ను త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.