Site icon NTV Telugu

RRR : ఈ హీరోలకు ఛాన్స్ మిస్… రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

RRR

RRR మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటి వరకూ జరిగిన ప్రమోషన్స్‌లో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్న అందరిలోనూ మెదిలింది. చివరి నిమిషంలో మీడియాతో ముచ్చటించిన విజయేంద్ర ప్రసాద్ తన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. RRR ఆలోచన ఎలా వచ్చిందనే ప్రశ్నకు రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ ఎవరికీ తెలియని సీక్రెట్స్ రివీల్ చేశారు. రాజమౌళి మొదట మల్టీ స్టారర్ తీయాలని అనుకున్నారని, అయితే మొదట ఎవరినీ పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, స్క్రిప్ట్‌ను అభివృద్ధి చేశారట.

Read Also : RRR : ‘నాటు’ స్టెప్పుకు 17 టేకులు… కానీ చివరికి…!

ఆ తర్వాత కొన్ని రోజులకు రజనీకాంత్-అర్జున్, సూర్య-కార్తీ వంటి స్టార్స్‌తో పాటు మరికొన్ని కాంబినేషన్‌లు అనుకున్నారు. అయితే సహజంగానే స్నేహంగా ఉండే స్టార్స్, రెండేళ్లపాటు ఒకరితో ఒకరు కలిసి ఉండే ఇద్దరు హీరోలు కావాలి. కాబట్టి రియల్ లైఫ్ ఫ్రెండ్స్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇంకేముంది చెర్రీ, తారక్ ల వల్ల ఆ స్టార్ హీరోలు ‘ఆర్ఆర్ఆర్’ను మిస్సయ్యారు. అయితే వేరే హీరోలను ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం తీసుకుని ఉంటే, ఇంత హైప్ వచ్చి ఉండేదా ? అంటే డౌటే మరి !

Exit mobile version