NTV Telugu Site icon

Michelle Yeoh: 2004లో నిశ్చితార్థం.. 2023లో పెళ్లి.. ఆస్కార్ నటి సుధీర్ఘ ప్రేమకథ

Michelle Yeoh Marriage

Michelle Yeoh Marriage

Oscar Award Winner Michelle Yeoh Married Her Boyriend Jean Todt After 19 Years Of Engagement: ప్రేమ.. ఎంతో మధురమైన ఈ రెండు పదాల్ని నేటి యువత భ్రష్టు పట్టించేసింది. ప్రేమలో ఉన్న గాఢతని అర్థం చేసుకోకుండా, కేవలం పైపైనే తమ సోకులు పూర్తి చేసుకుంటున్నారు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు.. ప్రేమించుకున్నామా, శారీరకంగా కలుసుకున్నామా, బ్రేకప్ చేప్పేశామా! ఈ పంథానే కొనసాగిస్తోంది ప్రస్తుత తరం యువత. పెళ్లి బంధాలు కూడా అలాగే ఏడ్చాయి. ఎంతో పవిత్రమైన ఆ బంధాన్ని.. ఇగోలకు పోయి పాడు చేస్తున్నారు. అలాంటి ఈ రోజుల్లో.. ఓ జంట అసలైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. 2004లో నిశ్చితార్థం చేసుకున్న ఆ జంట.. తమ సుదీర్ఘ ప్రేమను కొనసాగిస్తూ చివరికి 2023లో పెళ్లి చేసుకుంది. ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకున్న ఓ నటి లవ్ స్టోరీ కావడంతో, ఈ టాపిక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Huma Qureshi: ఒకట్రెండు సార్లు కాదు, చాలాసార్లు జరిగింది.. హుమా ఖురేషి ఆవేదన

ఆ నటి పేరు మిచెల్లా యో. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఈ నటి.. అందులో అద్భుతమైన నటనా కౌశలం చాటి, ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఈమెను ఫెర్రారీ మాజీ సీఈఓ జేన్ టాడ్‌ 2004 జులై 6వ తేదీన ప్రపోజ్ చేశాడు. అందుకు ఆమె అంగీకారం తెలిపింది. ఆ ఏడాదిలోనే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ.. పెళ్లికి మాత్రం గ్యాప్ ఇచ్చారు. ఎంత గ్యాప్ ఇచ్చారో తెలుసా? ఏకంగా 19 సంవత్సరాలు. ఈ గ్యాప్ రావడానికి గల కారణాలేంటో తెలీదు కానీ.. వీరి ప్రేమాయణం మాత్రం కొనసాగుతూనే వచ్చింది. రోజులు గడిచేకొద్దీ వీరి మధ్య ప్రేమ మరింత పెరుగుతూ వచ్చిందే తప్ప తరగలేదు. ఎట్టకేలకు 6992 రోజుల తర్వాత అంటే 19 ఏళ్ల అనంతరం ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. గురువారం స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా.. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. వీరి పెళ్లి విషయాన్ని విషయాన్ని ఫార్ములా వన్ డ్రైవర్ ఫెలిఫ్ మస్సా బయటపెట్టాడు. తన ఇన్‌స్టాలో ఆ ఇద్దరితో కలిసి దిగిన ఫోటోలను షైతం షేర్ చేశాడు.