లాలట్టన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ట్రాక్ ఎక్కేశాడు. నేరు తర్వాత భారీ బడ్జెట్ అండ్ ప్రయోగాత్మక చిత్రాలు చేసి దెబ్బతిన్నాడు మోహన్ లాల్. మాల్కోటై వాలిబన్, దర్శకత్వం వహించిన బర్రోజ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలయ్యాయి. బర్రోజ్ ఒక్కటే వంద కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. రూ. 150 కోట్ల పెట్టి బొమ్మ తీస్తే రూ. 20 కోట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. ఈ రెండు ప్లాపులతో కాస్తంత తడబడిన మాలీవుడ్ స్టార్ హీరోను మళ్లీ ట్రాక్ ఎక్కించింది లూసిఫర్ 2 ఎంపురన్.
Also Read : Nivetha : సినిమాలకు దూరంగా మలయాళ బ్యూటీ.. కారణం ఏంటి.?
మార్చి 27న రిలీజైన ఎంపురన్ ఓవరాల్‌గా రూ. 260 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పుడు లేటెస్ట్ గా నెల రోజుల గ్యాప్‌లోనే వచ్చిన తుడరుమ్ కూడా హిట్ కొట్టేసింది. 15 ఏళ్ల తర్వాత లాలట్టన్‌తో జోడీ కట్టింది సీనియర్ బ్యూటీ శోభన. దృశ్యం తరహాలోనే ఇది కూడా ఫ్యామిలీ అండ్ రివేంజ్ డ్రామాగా తీసుకువచ్చాడు డైరెక్టర్ తరుణ్ మూర్తి. ఏప్రిల్ 25న రిలీజైన తుడరుమ్ దూసుకెళుతోంది. ఇప్పుడు వంద కోట్ల క్లబ్‌లోకి జాయిన్ అవుతోంది. ఎంపురన్, తుడరుమ్ హిట్లతో మాల్కోటై వాలిబన్, బర్రోజ్ లెక్కలు సరిచేసినట్లయ్యింది మోహన్ లాల్. ప్రయోగాల కంటే సింపుల్ ఫ్యామిలీ మ్యాన్ గెటప్‌లోనే కోట్లు కొల్లగొడుతున్నాడు కంప్లీట్ స్టార్. అందులోనూ తక్కువ బడ్జెట్ చిత్రాలే కాసుల వర్షం కురిపిస్తున్నాయి. లూసిఫర్ 2 సుమారు రూ. 150 కోట్లు ఖర్చుపెట్టగా తెచ్చింది రూ. 260 కోట్లే. కానీ తుడరుమ్ పై రూ.30 కోట్లలోపే బడ్జెట్ కేటాయించగా రూ. 100 క్లబ్‌లోకి చేరింది. ఈ లెక్కన చూస్తే తుడరుమ్ మెరుగైన లాభాల్ని చూసింది. ఇక తెలుగులో కూడా బ్రేక్ ఇవెన్ అయింది.
