NTV Telugu Site icon

OMG 2: భక్తుడిని కాపాడుకోవడానికి శివుడే దిగొచ్చాడు…

Omg 2

Omg 2

2012లో వచ్చిన అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’కు సీక్వెల్ కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఖిలాడీ ‘దేవుడి’ పాత్రలో చేసిన ఫన్ కి, ఇచ్చిన సోషల్ మెసేజ్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ‘ఓ మై గాడ్ 2’ ఆగస్టు 11న రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్షయ్ కుమార్ సీక్వెల్ లో నటిస్తుండగా, పరేష్ రావల్ ప్లేస్ లో పంకజ్ త్రిపాఠీ వచ్చి చేరాడు. ఇందులో యామీ గౌతమ్ ఓ కీలక పాత్ర పోషించబోతోంది. ఈ చిత్రానికి అమిత్ రాజ్ రచన చేసి దర్శకత్వం వహిస్తున్నారు. విపుల్ డి షా, రాజేశ్ బెహల్, అశ్విన్ వార్దే ‘ఓఎంజీ -2’ను నిర్మిస్తున్నారు. ఖిలాడీ ఫాన్స్ కి కిక్ ఇస్తూ OMG 2 ట్రైలర్ ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. మూడున్నర నిమిషాల పాటు మాత్రమే ఉన్న ఈ ట్రైలర్ లో అక్షయ్ కుమార్ శివుడిగా, పంకజ్ ఆయన భక్తుడిగా కనిపించాడు. సోషల్ మెసేజ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా OMG సినిమాల్లో ఉంటుంది ఈ ట్రైలర్ లో మాత్రం ఆ ఫన్ ఎలిమెంట్ కి ఎక్కువగా చూపించలేదు. ట్రైలర్ దేవుడు, భక్తుడు చుట్టే సీరియస్ గా తిరిగినట్లు ఉంది.

అక్షయ్ కుమార్ లాంగ్ హెయిర్ తో కొత్తగా కనిపించాడు, ట్రైలర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కొట్టారు. అందుకే అక్షయ్ కుమార్ కనిపించిన సమయంలో మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. ఓపెనింగ్ షాట్ లో శివుడు, నంది మధ్య డైలాగ్ తో ట్రైలర్ ని ఓపెన్ చేసి… పంకజ్ త్రిపాఠి కొడుకుకి వచ్చిన సమస్యని తీర్చడానికి కోర్ట్ మెట్లు ఎక్కడంతో ట్రైలర్ లో స్పీడ్ పెంచారు. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ వర్కౌట్ అయితే OMG 2 ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం గ్యారెంటీ. “గంగ ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో నాకు చెప్పకు” అని అక్షయ్ కుమార్ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో స్పెషల్ గా ఉంది. అక్షయ్ ఆశీర్వదిస్తే అది అవసరం లేదు డబ్బులు ఇవ్వమని ఒక చిరు వ్యాపారి అడగడం ప్రస్తుత మనుషుల స్వభావాన్ని తెలిపేలా ఉంది. పంకజ్ త్రిపాఠిలో అమాయకపు పాత్ర ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ భక్తుడికి వచ్చిన కష్టాన్ని కైలాసం నుంచి దిగి శివుడు ఎలా తీర్చాడు? పంకజ్ ప్రయాణంలో ఎలా సాయపడ్డాడు అనేది తెలియాలి అంటే ఆగస్టు 11న OMG 2 రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Show comments