Site icon NTV Telugu

M Suman Kumar Arrested : అమ్మాయితో లవ్ డ్రామా… సీరియల్ నటుడికి సినిమా చూపించిన పోలీసులు

M Suman Kumar

M Suman Kumar

అమ్మాయిని మోసం చేసినందుకు ఒడియా టెలివిజన్ సీరియల్ నటుడు ఎం సుమన్ కుమార్‌ కు పోలీసులు సినిమా చూపించారు. పెళ్లి సాకుతో అమ్మాయిని మోసం చేసి, శారీరక సంబంధం పెట్టుకున్న సుమన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. సదరు అమ్మాయి ఆరోపణ ప్రకారం ముందుగా ప్రేమిస్తున్నాను అని నమ్మించి, సాన్నిహిత్యం పెంచుకున్నాడు. పెళ్లి అనేసరికి మొహం చాటేశాడు. ఆమె ఎంత ట్రై చేసినా సుమన్ వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో ఆ అమ్మాయి స్థానికంగా ఉన్న పహాలా పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

Read Also : Friday Box Office : ఈ వారం సందడి… ఎన్ని సినిమాలంటే ?

కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుండగానే పోలీసులు ఈరోజు సుమన్ ను విచారణ కోసమని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అరెస్టు చేశారు. సుమన్ కుమార్‌పై ఐపీసీ 376 (2)(ఎన్), 420, 294, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, స్థానిక కోర్టుకు తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బాధితురాలి తరపు న్యాయవాది ప్రశాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా బాలికతో ఎం సుమన్‌ ప్రేమలో ఉన్నాడని, ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి దగ్గరయ్యాడని, ఇప్పుడు పెళ్లి అనగానే తప్పించుకు తిరుగుతున్నాడని వెల్లడించారు.

Exit mobile version