Site icon NTV Telugu

O Andala Rakshasi: రిలీజ్ కి రెడీగా ‘ఓ అందాల రాక్షసి’

O Andala Raksasi

O Andala Raksasi

‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి షెరాజ్ మెహదీ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం రాబోతోంది. ఇంత వరకు షెరాజ్ మెహదీ హీరోగా, విలన్‌గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా తన సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం ఓ అందమైన ప్రేమ కథా చిత్రంతో షెరాజ్ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

Kavya Thapar: అసిస్టెంట్ డైరెక్టర్ అలా అనేసరికి బిత్తర పోయా.. షాకింగ్ విషయం బయటపెట్టిన కావ్య

ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు భాష్యశ్రీ గారు కథ మాటలు, పాటలు రాశారు. అలాగే స్క్రీన్ ప్లేలో కూడా సపోర్ట్ చేశారు. ఆయన సహకారం వల్లే ఈ సినిమా ఇంత బాగా చేయగలిగాం. భాష్యశ్రీ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ‘ఓ అందాల రాక్షసి’ సినిమా గ్లామర్ బేస్డ్ మూవీ కాదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఒకరకంగా ఇది వుమెన్ ఓరియెంటెడ్ మూవీ అనుకోవచ్చు. మహిళల గురించిన అంశాలు ఉంటాయి. అమాయక మహిళలు కొందరి చేతిలో ఎలా మోసపోతున్నారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. అలాగే మోసం చేసేవారికి శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నాం. సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే థియేటర్స్ లో మిమ్మల్ని కలుస్తాం అన్నారు.

Exit mobile version