Site icon NTV Telugu

NTR Fans: శ్యామ్ చెల్లెల బాధ్యత తీసుకున్న ఎన్టీఆర్ ఫాన్స్…

Ntr Fans

Ntr Fans

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు. ఇక ఎన్టీఆర్ సైతం అభిమానుల కోసం ఏదైనా చేస్తాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ అభిమానుల్లో విషాదం చోటుచేసుకుంది. తారక్ వీరాభిమాని చిన్న వయస్సులోనే మృతి చెందాడు. శ్యామ్ చనిపోలేదు అతని మరణం వెనక ఎవరో ఉన్నారు, అందుకే కేస్ ఫైల్ చేసి ఎంక్వయిరీ చెయ్యాలని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ ఫాన్స్ పోలీస్ విచారణ కోరుతున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో శ్యామ్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఫాన్స్ అసోషియేషన్ ‘RAW NTR హెల్పింగ్ హాండ్స్’ శ్యామ్ ఫ్యామిలీని కలిసి వారికీ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

“పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. కాని శ్యామ్ కుటుంబానికి మేము అండగా నిలుస్తాం. ఇప్పటికే శ్యామ్ తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి అన్నీ విధాలుగా ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. శ్యామ్ తన కుటుంబానికి వెన్నుముక్కలాంటోడు, తను లేని లోటు ఆ కుటుంబానికి మనమెవ్వరం తీర్చలేనిది. అందుచేత! శ్యామ్ చెల్లెలు పెళ్లి భాద్యత మేము తీసుకున్నాము. అలాగే జరిగిన సంఘటన మీద పోలీసు శాఖను స్పష్టమైన దర్యాప్తు చెయ్యమని కోరుతున్నాము” అంటూ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక అభిమాని చనిపోయినందుకు మిగిలిన ఫాన్స్ సపోర్ట్ ఇస్తున్న విధానంకి అన్ని వర్గాల ప్రజల నుంచి అభినందనలు అందుతున్నాయి. ప్రస్తుతం #WEWANTJUSTICE FOR SHYAMNTR అనే టాగ్ ట్రెండింగ్ లో ఉంది.

Exit mobile version