NTV Telugu Site icon

NTR fan Shyam Death: శ్యాం మరణం పై అనుమానాలు ఉన్నాయి.. విచారణ జరపమని శ్యాం తండ్రి లేఖ!

Shyam Ntr Death

Shyam Ntr Death

NTR Fan Shyam Father demands deep investigation in his death: కోనసీమ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన శ్యాం అనే ఒక జాబ్ సెర్చ్ చేస్తున్న కుర్రాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడుతో కోసుకుని ఉరి వేసుకుని మృతి చెందారు. తన కొడుకుది హత్య అని శ్యామ్ తల్లిదండ్రులు చెబుతుండగా… శ్యామ్ ఉరి వేసుకుని చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని అన్నారు. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, శ్యామ్ ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసుని కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Akshara Gowda: ఓ మై గాడ్ అనిపిస్తున్న అక్షరా గౌడ్ అందాలు.. దుస్తులన్నీ ఉన్నా ఏమీ లేనట్టే!

ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇక ఈ రోజు మీడియా ముందుకు వచ్చిన శ్యాం కుటుంబ సభ్యులు ఇది అనుమానాస్పద మృతి అని పోలీసులు దీన్ని లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా కొత్తపేట డీఎస్పీకి శ్యాం తండ్రి ఒక లేఖ రాశారు. తన కుమారుడు అయిన మేడిశెట్టి శ్యాం మణికంఠ రామ్ ప్రసాద్ 24.6. 2023 శనివారం రాత్రి ఉరి వేసుకుని చనిపోయినట్టు సమాచారం ఇచ్చి ఉన్నారు. కానీ మా కుమారుడు గుర్తు తెలియని వ్యక్తులు చేతిలో హత్యకావించబడ్డాడు అని సభ్యులు అందరికీ అనుమానం ఉంది, కాబట్టి ఈ కేసులో మా కుటుంబానికి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Show comments