Site icon NTV Telugu

Prabhas: మారుతీ సినిమా నుంచి ఈరోజైనా అప్డేట్ వస్తుందా మాష్టారు?

Maruthi Prabhas

Maruthi Prabhas

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ మూవీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా అది ఇండియాకి షేక్ చేసే ఓకే సెన్సేషన్ అవుతుంది. అలాంటిది ఒక్క అఫీషియల్ అప్డేట్ లేకుండా ప్రభాస్ సినిమా షూటింగ్ ని చేసేస్తున్నాడు దర్శకుడు మారుతీ. ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవుతుంది అంటేనే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అందుకే పూజా కార్యక్రమాల విషయాలని కూడా బయటకి వెల్లడించకుండా డైరెక్ట్ గా సినిమా షూటింగ్ చేసేస్తున్నాడు మారుతీ. ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన షూటింగ్ ని చాలా వరకూ మారుతీ కంప్లీట్ చేశాడని టాక్. షూటింగ్ నుంచి లీక్ అయిన ప్రభాస్, మారుతీ కలిసి ఉన్న ఫోటోలు తప్ప మరో అఫీషియల్ అప్డేట్ అయితే ఈ ప్రాజెక్ట్ గురించి బయటకి రాలేదు. లీక్ అయిన ఫోటోస్ లో ప్రభాస్ స్టైలిష్ గా ఉండడంతో ప్రభాస్ అభిమానుల దృష్టి మారుతీ సినిమాపై పడింది.

ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న డిస్కషన్ ని బట్టి చూస్తే… ఈ మూవీలో అప్పుడప్పుడూ ప్రభాస్ లోకి ఒక ఆత్మ వచ్చి వెళ్తుందని, దాని ద్వారా ఫన్ జనరేట్ చేస్తూ సినిమా సాగుతుందని సమాచారం. ప్రభాస్ తో కామెడీ టచ్ ఉన్న సినిమా లేదా పూర్తిస్థాయి కామెడీ సినిమా చేయాలంటే దర్శక నిర్మాతలకి చాలా ధైర్యం కావాలి. ఆ సాహసాన్ని చేయడానికి మేకర్స్ అయితే రెడీ అయ్యారు మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈరోజు హీరోయిన్ మాళవిక మోహనన్ బర్త్ డే కావడంతో కనీసం ఈరోజైనా ప్రభాస్-మారుతీ సినిమా నుంచి ఒక్క అఫీషియల్ పోస్టర్ బయటకి వస్తుందేమో అని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అలాంటి అప్డేట్స్ ఏవీ రిలీజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. మరి మారుతీ, ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ ని ఎప్పటి నుంచి మొదలుపెడతాడు? ఎలాంటి కంటెంట్ తో బయటకి వస్తాడు అనేది చూడాలి.

Exit mobile version