హీరోయిన్స్ కేవలం నటనకే పరిమితం కావట్లేదు. నిర్మాణ రంగంలోనూ అడుగులేసి రిస్క్ తీసుకుంటున్నారు. ఈ ఏడాది మా ఇంటి బంగారంతో సమంత బ్లాక్ బస్టర్స్ చవిచూసింది. నయనతార అండ్ వరలక్ష్మీ శరత్ కుమార్ నిర్మాతలుగా దెబ్బతిన్నారు. నెక్ట్స్ నిత్యామీనన్ టైం వచ్చింది. హీరోయిన్స్ నిర్మాతలుగా న్యూ స్టెప్స్ తీసుకుంటోన్న వేళ.. నిత్యా మీనన్ కూడా ప్రొడ్యూసర్‌గా రిస్క్ చేస్తానంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేయూరీ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది కేరళ కుట్టీ. క్రియేటివ్ స్టోరీస్ అందించడమే లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేసింది కానీ న్యూ మూవీ ఎనౌన్స్ చేయలేదు నిత్య.
నిత్యామీనన్‌కు ప్రొడక్షన్ రంగం కొత్తేమీ కాదు గతంలో నిత్యామీనన్ ప్రొడక్షన్ కంపెనీ పేరుతో స్కై లాబ్ మూవీకి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. కరోనా టైంలో రిలీజైన ఈ మూవీ కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. దీంతో మళ్లీ నిర్మాణం జోలికి పోలేదు. ఇక హీరోయిన్‌గా అవకాశాలు అడుగంటున్న వేళ కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యింది. కావలై వెండం ఫేం డీకే చెప్పిన కథకు ఫ్లాటైన నిత్యామీనన్ అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనుందట. ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా మారుతున్నాడు. అయితే ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్న నిత్య ప్రాఫిట్ షేర్ విధానంలో పేమేంట్ తీసుకుంటుందన్న టాక్ నడుస్తోంది. తెలుగులో భీమ్లా నాయక్ తర్వాత వెండి తెరపై కనిపించని కేరళ కుట్టీ మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చేది ఎప్పుడో ?

