Site icon NTV Telugu

నిఖిల్ మూవీ కోసం మెగాఫోన్ పట్టబోతున్న ఎడిటర్!

Nikhil Siddharth turns spy

ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ ‘కార్తికేయ -2′ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్షన్ లోనూ, ’18 పేజెస్’ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలోనూ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఓ పాపులర్ ఎడిటర్ డైరెక్షన్ లో నిఖిల్ మూవీ చేయబోతున్నాడు. అతను మరెవరో కాదు… ‘క్షణం’ మూవీతో ఎడిటర్ గా పరిచయం అయిన వైజాగ్ అబ్బాయి బి.హెచ్. గ్యారీ. ఫోటోగ్రఫీ అంటే అభిరుచి ఉన్న గ్యారీ తన మిత్రుడు రవికాంత్ పేరెపు సలహాతో ఎడిటర్ గా ‘క్షణం’ మూవీతో కెరీర్ ప్రారంభించాడు. ఇక అక్కడ నుండి ఈ యంగ్ ఎడిటర్ వెనుదిరిగి చూసిందే లేదు.

Read Also : “భీమ్లా నాయక్” వచ్చేశాడు… పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్

‘గూఢచారి, ఎవరు, హిట్’ వంటి సినిమాలు గ్యారీకి ఎడిటర్ గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా విడుదలైన విశ్వక్ సేన్ ‘పాగల్’ మూవీకి కూడా గ్యారీనే ఎడిటింగ్ చేశాడు. దర్శకత్వం వహించాలనే చిరకాల కోరికను గ్యారీ.. నిఖిల్ మూవీతో తీర్చుకోబోతున్నాడు. నిఖిల్ హీరోగా ఓ యాక్షన్ స్పై ఫిల్మ్ ను కె. రాజశేఖర్ రెడ్డి, రెడ్ సినిమాస్ సీఇఓ చరణ్ తేజ్ నిర్మించబోతున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. అతి త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే… దీనితో పాటే నిఖిల్ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లోనూ మరో సినిమాకు కమిట్ అయ్యాడు.

Exit mobile version