18 Pages: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజీస్. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన మొదటి సాంగ్ నన్నయ్య రాసిన.. ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సాంగ్ ను కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో పాడిస్తున్నట్లు మేకర్స్ అప్డేట్ ఇచ్చి ట్రెండ్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఫుల్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ” నీకు నాకు బ్రేకప్ అయ్యి వన్ డే కూడా అవ్వలేదు.. నా గుండె ఇంకా నమ్మలేదు” అంటూ సాగిన ఈ సాంగ్ ఆకట్టుకొంటుంది. టైమ్ ఇవ్వు పిల్లా.. కొంచెం టైమ్ ఇవ్వు.. నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమ్ ఇవ్వు అంటూ సాగిన క్యాచీ లిరిక్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా శింబు వాయిస్ సాంగ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది.
బ్రేకప్ అయ్యిన వెంటనే అమ్మాయి ప్రేమించినవాడిని మర్చిపోయి వేరేవాడితో ప్రేమలో పడుతోంది.. కానీ అబ్బాయి మాత్రం ప్రేమించిన అమ్మాయి కోసమే ఆలోచిస్తాడు అనే అర్ధం వచ్చినట్లు ఈ సాంగ్ ఉంది. ఇక ఇప్పటి యూత్ కు ఈ సాంగ్ చక్కగా సరిపోతోంది. అందుకు తగ్గట్టుగానే శ్రీమణి లిరిక్స్ రాయగా గోపిసుందర్ ఫ్రెష్ మ్యూజిక్, శింబు హస్కి వాయిస్ తో వచ్చిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక వీడియోలో టైమ్ ఇవ్వు పిల్లా.. కొంచెం టైమ్ ఇవ్వు.. నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమ్ ఇవ్వు హుక్ స్టెప్ నిఖిల్ అదరగొట్టేశాడు. మొత్తానికి ఈ సాంగ్ కూడా విజయవంతంగా మారింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
