Site icon NTV Telugu

Nidhhi Agerwal: నేను హాటా.. అంతా మారిపోద్ది.. నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్

Nidhi Agarval

Nidhi Agarval

చేతినిండా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ నిధి అగర్వాల్. పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ తో ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తుంది. ప్రజంట్ ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ మూవీలో, ప్రభాస్ మొదటిసారి హారర్ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Red:   Triphala: త్రిఫల నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడిన సంగీత దర్శకుడు తమన్.. ‘ఇది చాలా మాస్ ఆల్బమ్. చాలా రోజుల తర్వాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్, డ్యూయెట్, ఐటెం సాంగ్, ముగ్గురు అమ్మాయిలతో ఒక పాట.. ఇలా చాలా రకాల పాటలు ఈ మూవీలో ఉన్నాయి. ఇది మంచి ఫాంటసీ మూవీ. కామెడీ బాగుంది. వింటేజ్ ప్రభాస్‌ను చూస్తారు’ అని చెప్పారు. దీంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిడిపొయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ కూడా తన పాత్ర గురించి మాట్లాడుతూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

నిధి మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు ఎక్కువగా నా నుంచి గ్లామర్ పాత్రలు ఆశిస్తారు. నేను అలాంటి పాత్రలే ఎక్కువగా చేస్తానని అందరూ అనుకుంటున్నారు. కానీ ‘రాజాసాబ్’ మూవీ లో నన్ను చూసిన తర్వాత ప్రజలకు నాపై ఉన్న ఈ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఇది మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాలో నా పాత్ర రెగ్యులర్ హాట్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది.మీరు ఆశ్చర్యానికి గురి కావడం ఖాయం’ అని చెప్పుకొచ్చింది.

Exit mobile version