Site icon NTV Telugu

New Movie: విజయభాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా!

Jeevitha

Jeevitha

‘స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు కె. విజయ్ భాస్కర్ కొంత విరామం తర్వాత మెగాఫోన్ చేపడుతున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విజయ భాస్కర్‌ దర్శకత్వంలో వస్తున్న 13వ చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించిన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్‌లోని మణికొండలో ఘనంగా జరిగింది. విజయ భాస్కర్, జీవిత రాజశేఖర్, ‘కార్తికేయ’ నిర్మాత బొగ్గరం వెంకట శ్రీనివాస్, పారిశ్రామికవేత్త, నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ ఈ వేడుకకు హాజరై నిర్మాతకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ, ‘రాబోవు విజయదశమి రోజున ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమౌతుందని, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఆ రోజు వెల్లడిస్తామ’ని తెలిపారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ‘ఈ చిత్రం కోసం యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే కథని సిద్ధం చేశామ’ని దర్శకులు విజయభాస్కర్ చెప్పారు.

Exit mobile version