NTV Telugu Site icon

Richa Chadda: అక్షయ్ కుమార్ ని ‘కెనడా కుమార్’ అంటూ విమర్శలు

Akshay Kumar

Akshay Kumar

‘Galwan says hai’ అంటూ ట్వీట్ చేసి  బాలీవుడ్ హీరోయిన్ ‘రిచా చద్దా’ విమర్శలు ఫేస్ చేస్తోంది. ఈ హీరోయిన్ చేసిన ట్వీట్ పై బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ‘అసలు ఊహించలేదు, భారత సైన్యం ఉంది కాబట్టే మనం ప్రశాంతంగా ఉన్నాం’ అంటూ స్పందించాడు. ఇండియన్ ఆర్మీకి మద్దతుగా అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్ మంచిదే కానీ ఇది కొంతమందికి నచ్చినట్లు లేదు. రిచా చద్దా చేసిన కామెంట్స్ ఎంత మందిని హార్ట్ చేశాయో తెలియదు కానీ అక్షయ్ కుమార్ చేసిన కామెంట్స్ మాత్రం చాలా మందినే హార్ట్ చేసినట్లు ఉన్నాయి. అక్షయ్ కుమార్ ని ‘కెనడా కుమార్’ అంటూ ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్ లో ఎలాంటి తప్పు లేదు కానీ పనిగట్టుకోని కావాలనే కొందరు యాంటి ఫాన్స్ అతనిపై నెగటివ్ పోస్ట్ లు పెడుతున్నారు.

కెనడా సిటిజెన్షిప్ ఉన్న అక్షయ్ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి ముప్పై ఏళ్లు అయ్యింది. ఈ మూడు దశాబ్దాల కాలంలో అక్షయ్ కుమార్ హీరోగా, ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు చేశాడు. హైయెస్ట్ టాక్స్ పే చేస్తున్నాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ‘కెనడా కుమార్’ అనడం కరెక్ట్ కాదంటూ ఆయన ఫాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ‘కెనడా కుమార్’ అనే ట్యాగ్ ట్రెండ్ చేస్తున్న వారికి ‘భారత కుమార్’ అనే ట్యాగ్ తో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఇక అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్ గురించి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ “Didn’t expect this from you... having said that richa is more relevant to our country than you sir” అంటూ ట్వీట్ చేశాడు. అక్షయ్ కుమార్ కన్నా రిచా చద్దానే ఎక్కువ మంది తెలుసు అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.