ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలయ్య. అదే జోష్ లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న అఖండ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య. వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేనితో బాలయ్య మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
Also Read : Manoj Manchu : ‘డేవిడ్ రెడ్డి’గా మంచు మనోజ్.. టైటిల్ పోస్టర్ సూపర్
రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నారట. వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలయ్యతో గోపీచంద్ మలినేని చేయబోయే సినిమా రెండు వేరు వేరు కాలాలకు చెందిన స్టోరీ అని చరిత్రను వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీని రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఒకరకంగా టైమ్ ట్రావెల్ లాంటి కథలా ఉంటుందని బాలయ్యను మునుపెన్నడు చూడని విధంగా పవర్ఫుల్ గా ఉండబోతుందట. స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఫినిష్ చేసేసాడట గోపీచంద్ మలినేని. ఈసారి గోపీచంద్ మలినేని, బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఊర మాస్ సినిమా ప్లానింగ్ చేస్తున్నారు. ఈ పవర్ఫుల్ కాంబోను అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు నిర్మించనున్నారు. అఖండ 2 తర్వాత గోపిచంద్ మలినేని సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.
