NTV Telugu Site icon

NBK 109 : ‘డాకు మహారాజ్’ పై ఎక్స్ లో నాగవంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Thaman

Thaman

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణనటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్నా ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read : Kanchana – 4 : దెయ్యంగా పొడుగు కాళ్ల సుందరి..

కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నాగవంశీ ‘ ఇప్పుడే డాకు మహారాజ్’ సినిమా చూసాను. ఈ సినిమాకు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ భీబత్సమ్. జనవరి 12వరకు వేచి ఉండండి. ఈ సినిమా కోసం తమ్ముడు తమన్ ఎవరూ ఊహించలేని లైఫ్ టీమ్ ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ ఇచ్చాడు. థియేటర్స్ లో శివ తాండవమే అమ్మా’ అని రాసుకొచారు. నాగవంశీ ట్వీట్ తో బాలయ్య అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా అమెరికాలోని డల్లాస్ లో జనవరి 4న సాయంత్రం 6.00 గంటలకు నిర్వహిచబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. డాకు మహారాజ్ ఈవెంట్ ను ఎన్నడూ చూడని విధంగా ఎవరు చూడని విధంగా ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత నాగవంశీ.

Show comments