Site icon NTV Telugu

‘గాడ్ ఫాదర్’ అప్డేట్… హైదరాబాద్ లో స్టార్ హీరోయిన్

god-father

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “గాడ్ ఫాదర్” షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇది మలయాళ చిత్రం ‘లూసిఫర్‌’కి తెలుగు రీమేక్. ఇందులో చిరు ‘గాడ్‌ఫాదర్‌’గా కనిపిస్తాడు. చిరంజీవి 153వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ అండ్ సూపర్ గుడ్ ఫిలింస్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కరోనా సోకి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా, మరో వైపు ఆయన లేకుండా చేయాల్సిన సన్నివేశాల షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తోంది టీం. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నయన్ షూటింగ్ ముగించుకుని వెళ్తూ హైదరాబాద్‌లో కన్పించారు.

Read Also : హీరోయిన్ పుట్టుమచ్చలు రియల్ గా చూశారా.. రిపోర్టర్ ప్రశ్నకు హీరో రియాక్షన్

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ గత ఏడాది ప్రారంభమైంది. చిరంజీవిపై ఇప్పటికే కొన్ని ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ‘గాడ్‌ఫాదర్‌’లో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇద్దరు అతిపెద్ద సూపర్‌స్టార్‌లు మొదటిసారిగా స్క్రీన్-స్పేస్‌ను పంచుకున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు.

Exit mobile version