Site icon NTV Telugu

Inspector Rishi: దెయ్యం రోజూ నా బెడ్ రూమ్ కొచ్చేది.. నవీన్ చంద్ర షాకింగ్ కామెంట్స్

Naveen Chandra

Naveen Chandra

Naveen Chandra Comments at Inspector Rishi Press Meet: నవీన్ చంద్ర లీడ్ రోల్ లో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “ఇన్స్ పెక్టర్ రిషి ఈ నెల 29వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవబోతోంది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ అమెజాన్ ఒరిజినల్ గా డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు.”ఇన్స్ పెక్టర్ రిషి” వెబ్ సిరీస్ టీమ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవీన్ చంద్ర మాట్లాడుతూ హారర్ కంటెంట్ చేసి చాలా రోజులవుతోంది, “ఇన్స్ పెక్టర్ రిషి” వెబ్ సిరీస్ కథ విన్నప్పుడు ఇందులో హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, యాక్షన్ …లాంటి అన్ని ఎమోషన్స్ ఉన్నాయనిపించిందన్నారు. ఈ సిరీస్ ఎందుకు చేయకూడదు అని దూకేశా, ఇలాంటి క్యారెక్టర్ దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ కథలోనే కాదు నా క్యారెక్టర్ లోనూ అనేక లేయర్స్ ఉంటాయని అన్నారు.

BiggBoss Winner Arrested: బిగ్ బాస్ విజేత మునావర్ ఫరూఖీ అరెస్ట్.. హుక్కా తాగుతూ..?

హారర్ థ్రిల్లర్స్ లో ఇదొక స్పెషల్ సిరీస్ అవుతుంది, ఈ సిరీస్ కోసం దాదాపు 100 రోజులు వర్క్ చేశా అని అన్నారు. రోజూ షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చాక ఈ సిరీస్ లోని ఘోస్ట్ బెడ్ రూమ్ లో కనిపించిన ఫీల్ కలిగేది, ఎందుకంటే నాకు దెయ్యానికి చాలా కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను మా డైరెక్టర్ నందినిపై నమ్మకంతో ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ మేక్ బిలీవ్ కు థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. 10 ఎపిసోడ్స్ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ ముగిశాక నెక్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఏర్పడుతుంది. “ఇన్స్ పెక్టర్ రిషి” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా మంది నాకు మెసేజ్ లు పంపారు, భయమేసేలా ఉంది కానీ మేము ఈ సిరీస్ చూస్తాం అని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా మా సిరీస్ ట్రైలర్ ని కాజల్ చూసి చాలా బాగుంది నేను షేర్ చేస్తా అని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తప్పకుండా ఈ సిరీస్ చూస్తానని కాజల్ చెప్పారు. ఈ నెల 29న “ఇన్స్ పెక్టర్ రిషి” వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో చూస్తారని కోరుకుంటున్నానన్నారు.

Exit mobile version