Nara Rohit’s 20th Film Titled Sundarakanda: హీరో నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ సినిమాగా “సుందరకాండ” తెరకెక్కుతోంది. దర్శకుడు వెంకటేష్ నిమ్మల పూడిని పరిచయం చేస్తూ సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి – రాకేష్ మహంకాళి నిర్మించిన వినోదభరితమైన రొమాంటిక్ కామెడీ మూవీగా “సుందరకాండ” ప్రేక్షకులను పకరించడానికి సిద్ధమవుతోంది. ప్రతి వ్యక్తికి రిలేట్ అయ్యేలా జీవితంలో ఉండే అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించే విధంగా ఈ చిత్రం ఉండబోతుందని అంటున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నారా రోహిత్ కూల్ అండ్ క్లాసీ అవతార్ లో చేతిలో కుండతో, మరో చేతిలో పుస్తకంతో సుందరకాండ అనే టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. పోస్టర్ లో కాలేజీ విద్యార్థులు వ్యతిరేక దిశలో నడుస్తున్నట్లు మనం చూడవచ్చు, ఈ సినిమా విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించారు. గణేష్ చతుర్థి (సెప్టెంబర్ 7) సందర్భం గా సెప్టెంబర్ 6,2024 న ప్రేక్షకుల ముందుకి రానుంది.
సుందరకాండ హిందూ ఇతిహాసం రామాయణంలో ఐదవ కాండం. సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసే ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించడానికి శ్రీరామ నవమి పర్వదినాన్ని సరైన సందర్భం గా భావించి మేకర్స్ ఈ రోజు టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమాలో నారా రోహిత్ సరసన వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కాగా, రాజేష్ పెంటకోట ప్రొడక్షన్ డిజైనర్, రోహన్ చిల్లాలే ఎడిటర్. ఇక వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, VTV గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.