NTV Telugu Site icon

Srimanthudu: శ్రీమంతుడు ‘కథ’కి నారా రోహిత్ హీరో.. కానీ కాపీ కొట్టి మహేష్ తో తీసేశారు!

Srimanthudu Movie

Srimanthudu Movie

Nara Rohit was the initial choice for the film based on Srimanthudu original Weekly Story: మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా తాను స్వాతి వీక్లీలో రాసిన చెప్పాలని ఉంది అనే నవలకు కాపీ అని వీక్లీ నవల రాసిన శరత్ చంద్ర కోర్టులో కేసుల వరకు వెళ్లిన సంగతి తెలిసింద. అయితే నిజానికి ఈ సినిమా తాము చేయాలని అనుకున్నామని తాను రాసిన నవల తీసుకుని దర్శకుడు సముద్ర దగ్గరికి వెళ్తే ఆయన సినిమా కథ సిద్ధం చేశారని, తాము ప్రీ ప్రొడక్షన్ లో ఉండగానే శ్రీమంతుడు సినిమా రిలీజ్ చేసేసి తమకి షాక్ ఇచ్చారని ఈ సందర్భంగా శరత్ చంద్ర పేర్కొన్నారు. తాము ఈ సినిమాకి హీరోగా నారా రోహిత్ ను అనుకున్నామని నారా రోహిత్ హీరోగా కథ అంతా పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ లో నిమగ్నమైన సమయంలోనే వాళ్లు ఏకంగా శ్రీమంతుడు సినిమా చేసి రిలీజ్ చేశారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Ram Gopal Varma: వర్మ ఒళ్లో మరో అందమైన భామ.. ఎవరో తెలుసా?

ఇక ఆ రోజుల్లోనే సెటిల్మెంట్ చేస్తామని చెప్పి కొంతమంది సినీ పెద్దలు పది, పదిహేను లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ తనకు న్యాయం జరగాలని ఆయన కోరారు. ఇక తన తప్పు ఒప్పుకుని కొరటాల శివ జైలు శిక్ష అనుభవించాలని శరత్ చంద్ర డిమాండ్ చేస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ శ్రీమంతుడు సినిమా తెరకెక్కింది. ఎప్పుడో ఊరు వదిలి వెళ్లి ఇతర రాష్ట్రాల్లో స్థిరపడి కోట్లు సంపాదిస్తున్న కుటుంబానికి చెందిన ఒక వారసుడు మళ్ళీ అదే గ్రామానికి వెళ్లి తన సొంత ఊరు అని తెలియకుండానే ఆ గ్రామానికి కావలసిన వసతులు అన్ని సమకూర్చిన వ్యక్తి కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.