NTV Telugu Site icon

Nara Lokesh: ‘’వ్యూహం’’కు ప్రతివ్యూహం లేకపోతే ఎలా?

Lokesh

Lokesh

Nara Lokesh Comments on Vyuham Movie: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్ర విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. సి బి ఎఫ్ సి జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి 11 వరకు సస్పెన్షన్ లో ఉంచుతూ ఆదేశాలిచ్చి తదుపరి విచారణ జనవరి 11 కు వాయిదా వేసింది. ‘వ్యూహం’కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ తెలంగాణ హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం గురువారం విచారణ చేపట్టి జనవరి 11 కు వాయిదా వేసింది. ఈ క్రమంలో ‘వ్యూహం’ సినిమాపై టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి సినిమాలు తీయడం ఫ్యాషన్ అయిపోయింది, ఇలాంటి సినిమాలకు సీఎం జగన్ ఫండింగ్ చేస్తున్నారు అని ఆరోపించారు.

Actor Sivaji: ప్రశాంత్ రోడ్డెక్కే పరిస్థితి.. ‘స్పై’ పేరుతో ఫిలిం చేస్తానన్న శివాజీ

‘వ్యూహం’ సినిమా కోసం వర్మ తరపున తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నది కూడా వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డే, ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే ఈ సినిమా ఎలా ఉంటుందో ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. వర్మ నిజంగా సినిమా తీయాలనుకుంటే కోడి కత్తి, హూ కిల్డ్ బాబాయ్, ప్యాలెస్ లో జరుగుతున్న అవినీతి లాంటి అంశాలపై తీసుకోవచ్చన్నారు. తాను రాస్తున్న రెడ్ బుక్ గురించి లోకేష్ మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసు అధికారులు గురించి రెడ్ బుక్ లో రాస్తున్నా, తప్పులు చేసిన వారి గురించి తాను మాట్లాడితే తప్పేముందని ప్రశ్నించారు. అధికారులు తప్పుడు పనులు చేసినా మాట్లాడకూడదా? అని మండిపడ్డారు. కొల్లి రఘురామిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు వంటి వాళ్ల పేర్లు తన రెడ్ బుక్ లో ఉన్నాయని వీళ్లకు ఎలా తెలుసు అని ప్రశ్నించారు, అంటే… వీళ్లు తప్పులు చేశారని ఒప్పుకుంటున్నట్టేనా అని ఆయన అన్నారు.