Bloody Romeo : నాని ‘బ్లడీరోమియో’ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్

Nani Sujith

Nani Sujith

న్యాచురల్ స్టార్ నాని, యంగ్ అండ్ డైనామిక్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ బ్లడీ రోమియో. నిహారిక ఎంటెర్టైమెంట్స్ తో నాని సొంత నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్ పై నాని, వెంకట్ బోయినపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్టైలిష్ విజువల్స్, నాని సరికొత్త మేకోవర్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది.

వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘బ్లడీ రోమియో’ చిత్ర షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నెలలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించి, ఆ తర్వాత లండన్ వేదికగా ఒక భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. లండన్‌లో తీయబోయే సన్నివేశాలు ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. సుజీత్ మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ కలిపి ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు పని చేయబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. నాని-సుజీత్ కలయికలో వస్తున్న ఈ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.