Site icon NTV Telugu

Nani: ‘పుష్ప’ కథకు బాలీవుడ్ కు ఏమైనా సంబంధం ఉందా.. ?

Nani

Nani

న్యాచురల్ సస్టార్ నాని ప్రస్తుతం అంటే సుందరానికీ ప్రమోషన్స్ లో బిజీగా మారాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా మారిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాని పాన్ ఇండియా మూవీస్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. “పాన్ ఇండియా మూవీ అని మనం చెప్పుకోవడం కాదు అది ప్రేక్షకులు చెప్పాలి. వారికి కథ నచ్చి సినిమాను ఆదరించినప్పుడే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఉదాహరణకు పుష్ప సినిమా ఉంది.. నల్లమల్ల అడవుల్లో జరిగిన కథగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే నల్లమల్ల అడవులకు, బాలీవుడ్ కు ఏమైనా సంబంధం ఉందా..? అయినా సినిమా బాగా తెరకెక్కించడంతో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించడంతో అది పాన్ ఇండియా సినిమా అయ్యింది.. అలా కథపై దృష్టి పెట్టాలి కానీ పోస్టర్లపై పాన్ ఇండియా సినిమా అని వేసుకోవడం వలన ప్రయోజనం ఏంటి..?.

ప్రస్తుతం చిత్రపరిశ్రమకు గోల్డెన్ దశ నడుస్తోంది. సినిమా బావుంటే భాషతో పనిలేదు.. ఎక్కడైనా విజయం సాధిస్తుంది. మన తెలుగు సినిమాకే కాదు.. భారతీయ సినిమా పరిశ్రమకే ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని వైకాయ్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అంటే సుందరానికి కూడా పాన్ ఇండియా సినిమాగానే రిలీజ్ అవుతుంది.. ఒక్క కన్నడ భాషల్లో తప్ప మిగిలిన అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా నానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Exit mobile version