NTV Telugu Site icon

కృతి శెట్టి ముద్దు మీద ముద్దు

తొలి సినిమా ‘ఉప్పెన’తోనే స్టార్ డమ్ అందుకున్న నటి కృతి శెట్టి. దాంతో ఓవర్ నైట్ మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారింది. అంతే కాదు అమ్మడు ఏం చేసినా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. కృతి తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో కుర్రకారను బాగా ఆకట్టుకుంటున్నది మాత్రం నాని, కృతి ముద్దు సీన్. అందులో ఓ షాట్‌లో నాని ఉద్వేగంతో కృతి పెదవులపై ముద్దు పెట్టుకోవడం కనిపించింది. అంతే కాదు పాట ప్రోమోలో కూడా కృతి లిప్-లాక్ సీన్ వైరల్ అవుతోంది.

లిప్ లాక్ అనేతి మన టాలీవుడ్ లో కొత్త విషయం కాదు. ప్రస్తుతం టాప్ స్టార్‌ గా ఉన్న నటీమణులు అందరూ ఇందులో ఆరితేరిన వారే. ఇక ‘ఉప్పెన’లో కృతి అందమైన పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషించింది. ‘శ్యామ్ సింగరాయ్‌’లో మోడ్రన్ పాత్రను పోషించినట్లు అర్థం అవుతోంది. పల్లెటూరి అమ్మాయి పాత్రతో యూత్ హార్ట్ బీట్ పెంచిన కృతి ఇప్పుడు 24న విడుదల కాబోతున్న నాని సినిమాలోని లిప్ లాక్స్ తో మరింత గుండెదడలను పెంచుతుందేమో చూడాలి.