NTV Telugu Site icon

Nani 33: నాని సినిమాలో నటించాలని ఉందా.. మీకే ఈ బంపరాఫర్!

Slv Cinemas Casting Call

Slv Cinemas Casting Call

Nani 33 Movie Casting Call: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే సినిమా తెరగెక్కి సూపర్ హిట్టుగా నిలిచిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఇద్దరి కాంబోలో అదే సినిమా సీక్వెల్ తెరెక్కుతుందని ఆ మధ్య ప్రచారం జరిగింది కానీ అది నిజం కాదని తెలుస్తోంది. అయితే నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఒక సినిమా తర్కెక్కుతోంది. ప్రస్తుతానికి నాని 36వ సినిమాగా సంబోధిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక కాస్టింగ్ కాల్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్ని వయసులకు సంబంధించిన వారికి నటించే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే అందుకోసం మూడు ఫోటోలు, నిమిషంలోపు ఉన్న మూడు యాక్టింగ్ వీడియోలు పేర్కొన్న ఫోన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఒక మెయిల్ కూడా చేయాలని పేర్కొంది.

Actor Died: ఇండస్ట్రీకి షాక్.. గుండెపోటుతో నటుడు మృతి

అంతే కాదు తమ సినిమాలో నటించాలి అని ఆసక్తి ఉన్నవారికి ఏడాది పాటు టైం కేటాయించే కమిట్మెంట్ ఉండాలని, ప్రతి నటుడు నటి ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ కి సిద్ధంగా ఉండాలని వర్క్ షాప్స్ కి కూడా అటెండ్ అవ్వాలని పేర్కొంది. అయితే ఇన్స్టా రీల్స్ కానీ, టిక్ టాక్ వీడియోలు, సెల్ఫీ వీడియోలు పంపకూడదని అలాగే ఆఫీసుకు కూడా రాకూడదు అని పేర్కొన్నారు. శ్రీకాంత్ ఓదెల దసరా సినిమా తర్వాత ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి సినిమాని అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఏకంగా నటీనటులు కూడా కావాలని ప్రకటించడం చూస్తుంటే సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని అర్థమవుతుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Show comments