Site icon NTV Telugu

OMG: స్టోరీ నెరేట్ చేస్తూ ఉంటే నవ్వుతూనే ఉన్నా.. నందితా శ్వేతా ఆసక్తికర వ్యాఖ్యలు

Omg Event

Omg Event

Nanditha Swetha Comments at OMG Event: వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవిన్ నేని, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్) జూన్ 21న రాబోతోంది. మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నందితా శ్వేత మాట్లాడుతూ.. ‘నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. శంకర్ నాకు ఈ కథను చెప్పినప్పటి నుంచి షూటింగ్ కోసం ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నా. స్టోరీ నెరేట్ చేస్తూ ఉంటే నవ్వుతూనే ఉన్నా, హారర్, కామెడీ జానర్లతో రాబోతున్న ఈ మూవీని కుటుంబ సమేతంగా చూడొచ్చు.

Pushpa2 : పుష్ప 2 వాయిదా పై ఫ్యాన్ ఫైర్.. ఏకంగా హీరోకే వార్నింగ్ ఇచ్చాడుగా..

అందర్నీ నవ్వించేలా మా సినిమా ఉంటుంది. నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఓ మంచి ఘోస్ట్ సినిమా షూటింగ్‌ను మేం అంతా సరదాగా చేశాం. ఈ మూవీ అవుట్ పుట్ కూడా అలానే వచ్చింది. అందరికీ నచ్చేలానే ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు. నవమి గాయక్ మాట్లాడుతూ టీం అందరితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నందిత నాకెంతో సపోర్ట్ ఇచ్చారు అని అన్నారు. నటుడు నవీన్ నేని మాట్లాడుతూ సెట్స్‌లో అల్లరి చేస్తూ షూటింగ్ చేశాం. ఎంతో సరదాగా సినిమా షూటింగ్‌ను చేశాం. మూవీ ఎంతో బాగా వచ్చింది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు.

Exit mobile version