Site icon NTV Telugu

Namo: జూన్ 7న నమో.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌

Namo Event

Namo Event

Namo Movie Pre Release Event: విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ.ప్రశాంత్ నిర్మించిన చిత్రం ‘నమో’. ఈ సినిమాతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడుగా పరిచయం కాబోతుండగా జూన్ 7న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ..ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రశాంత్ సినిమాను నిర్మించారు. మంచి కథకి, సబ్జెక్ట్‌కి విశ్వంత్ లాంటి మంచి హీరో దొరకడంతోనే నమో సినిమాగా మారింది. అనురూప్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, విస్మయ మంచి నటి. రాహుల్ శ్రీ వాస్తవ మంచి విజువల్స్ ఇచ్చారు. ట్రైబల్ సెట్‌ను కిరణ్ కుమార్ అద్బుతంగా వేశారు.

Pithapuram Elections Results: పిఠాపురంలో రికార్డు పోలింగ్‌.. పవన్‌ కల్యాణ్‌ మెజార్టీపై ఆసక్తి!

క్రాంతి ఆచార్య నాకు చిన్నతనం నుంచి స్నేహితుడు, చక్కని సంగీతం ఇచ్చారు. నా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ వీక్షించి విజయవంతం చేయండి’ అని అన్నారు. విశ్వంత్ దుద్దంపూడి మాట్లాడుతూ.. ‘నమో నాకు కేవలం ఓ సినిమా కాదు. నాకు ఇదొక ఎమోషన్. టీం అంతా కలిసి ఎంతో సంతోషంగా పని చేశాం. ఓ ఫ్యామిలీలా కలిసి షూటింగ్ చేశాం. ఆదిత్య రాసిన పాత్రలు అద్భుతంగా వచ్చాయి. లాజిక్స్ పక్కన పెట్టి మ్యాజిక్ చూడండి. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. కచ్చితంగా పైసా వసూల్ చిత్రం అవుతుంది. అనురూప్ చాలా టాలెంటెడ్. విస్మయ చక్కగా నటించింది. నాకు అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

Exit mobile version