ఎట్టకేలకు కింగ్ నాగార్జున “బంగార్రాజు” పట్టాలెక్కింది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన” ప్రీక్వెల్ ను ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’లో నాగ్ బంగార్రాజు పాత్రకు సూపర్ క్రేజ్ లభించింది. అప్పట్టోనే దానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ టైటిల్ తో సినిమా తీస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ, నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేశాడు. అనంతరం ప్రీక్వెల్ కథ సిద్ధం చేసినా, వేరే కారణాల వల్ల ప్రాజెక్ట్ లేట్ అవుతూ వచ్చింది. ‘వైల్డ్ డాగ్’ ప్రచారంలోనూ ‘బంగార్రాజు’ ఉంటుందని, వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల చేస్తామని చెప్పాడు నాగార్జున. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్ లో ప్రారంభమై నవంబర్ కు పూర్తి చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ కరోనా ఇతర కారణాల వల్ల ఈ సినిమా ప్రారంభానికి ఇప్పటికి సమయం కుదిరింది.
Read Also : “రాధేశ్యామ్” స్పెషల్ షూట్… మరో మూడు రోజులు
“బంగార్రాజు” ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీంతో పాటు నాగార్జునతో పాటి నాగ చైతన్య, కృతి శెట్టి కూడా కన్పించారు. ఈ సినిమాలో చైతన్య సరసన హీరోయిన్ గా కృతిని సంప్రదించారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆమె భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో దర్శకనిర్మాతలు వెనక్కి తగ్గినట్టు పుకార్లు షికార్లు చేశాయి. ఆ రూమర్స్ సంగతేమో కానీ మొత్తానికి బేబమ్మ ఈ సినిమాలో కన్పించబోతుండడం ఆసక్తికరంగా మారింది. నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించనుంది. సినిమాకు సంబంధించిన మిగతా విరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
