Akkineni Nagarjuna: యంగ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ చిత్రంలో అక్కినేని అమల ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో సెప్టెంబర్ 9 న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల జోరు పెంచేసిన చిత్ర బృందం గతరాత్రి సినీ ప్రముఖలకు ఈ సినిమా స్పెషల్ షో వేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు అక్కినేని నాగార్జున, అఖిల్ హాజరయ్యారు.
సినిమా చూశాకా నాగ్ కంటతడి పెట్టుకొని అమలను గట్టిగా హత్తుకున్నారు. అమల, శర్వా నటనను అభినందించారు. సినిమా చాలా బాగుందని, తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని నాగ్ భరోసా ఇచ్చారు. అఖిల్ సైతం తల్లి నటనకు ముగ్దుడయ్యాడు. తల్లి కొడుకుల బంధాన్ని ఇందులో ఎంతో అద్భుతంగా చూపించడంతో అఖిల్ కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సినిమా చూసిన వారందరూ పాజిటివ్ టాక్ అందించినట్లు తెలుస్తోంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక గత కొన్నేళ్లుగా శర్వా హిట్ కోసం ఎంతో పరితపిస్తున్నాడు, మరి ఈ సినిమాతోనైనా శర్వా హిట్ ట్రాక్ అందుకుంటాడో లేదో చూడాలి.