Nagarjuna: సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా ఎంత ప్రత్యేకమో, ఆ తర్వాత రాబోయే 101వ చిత్రం కూడా అంతే ప్రత్యేకంగా నిలవబోతోంది. ప్రస్తుతం తన 100వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న నాగ్, ఆ తర్వాత ఎలాంటి కథను ఎంచుకుంటారు? ఏ దర్శకుడితో చేతులు కలుపుతారు? అనే చర్చలు సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ‘బొమ్మరిల్లు’ వంటి క్లాసిక్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు భాస్కర్, నాగార్జున 101వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇండస్ట్రీ లో సాగుతున్న సమాచారం ప్రకారం, దర్శకుడు భాస్కర్ ఇప్పటికే నాగార్జున కోసం ఓ కొత్త కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు కొనసాగుతున్నాయని, కథ నచ్చితే నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సెంటిమెంట్ ను హార్ట్ ని టచ్ చేసేలా చూపించడంలో భాస్కర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘బొమ్మరిల్లు’తో ఆయన అందుకున్న విజయాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. అయినప్పటికీ దర్శకుడిగా ఆయన కథ చెప్పే శైలిపై ఇండస్ట్రీలో మంచి అభిప్రాయం అయితే ఉంది.
ఇలాంటి సమయంలో నాగార్జునతో సినిమా చేసే అవకాశం వస్తే, అది భాస్కర్ కెరీర్‌లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు నాగార్జున కూడా ఎప్పటికప్పుడు కొత్త కథలు, కొత్త ఆలోచనలతో వచ్చే దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ముందుంటారు. కమర్షియల్ సినిమాలతో పాటు సెంటిమెంట్ కథలకు కూడా ఆయన ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకే భాస్కర్ వంటి దర్శకుడితో ఆయన కలయిక సాధ్యమైతే, అది విభిన్నమైన చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా షూటింగ్‌తో పూర్తిగా బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాతే తదుపరి సినిమాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, నాగార్జున, భాస్కర్ కాంబినేషన్ నిజమైతే, చాలా కాలం తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

