Site icon NTV Telugu

Naga Chaitanya: అమ్మానాన్న ‘థాంక్స్’.. గుండెలను పిండేస్తున్న చైతూ పోస్ట్

Nca

Nca

అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు -శిరీష్ నిర్మిస్తున్నఈ సినిమా జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. ఇప్పటికే వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న చైతన్య తాజాగా ‘థాంక్యూ’పేరుతో తమ కష్టాల్లో సహాయం చేసినవారికి, తమను వీడకుండా ఉన్నవారికి థాంక్యూ చెప్పమని #themagicwordisthankyou పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి అభిమానులకు షేర్ చేశాడు. ఎవరు ఎవరికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నారో ఈ హ్యాష్ ట్యాగ్ ను యాడ్ చేసి చెప్పమని కోరాడు. మొదటగా తానే తన జీవితంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులకు థాంక్స్ చెప్పాడు.

చైతన్య అమ్మ లక్ష్మి ఫోటోను షేర్ చేస్తూ.. “అమ్మ – నా అంతరంగికంగా, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు నిర్మించుకుంటూ నాలో పాతుకుపోయినందుకు, అన్ని విధాలుగా బేషరతుగా ఉన్నందుకు నీకు థాంక్స్..”.. తండ్రి నాగార్జున ఫోటో షేర్ చేస్తూ “నాన్న – నాకు దిశానిర్దేశం చేసినందుకు మరియు మరెవ్వరూ చేయలేని స్నేహాన్ని పంచి నా స్నేహితుడిగా ఉన్నందుకు నీకు థాంక్స్”.. “హ్యాష్- ఒక మనిషిగా నన్ను నేను ఎలా ప్రేమించాలో చూపించినందుకు థాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. తల్లిదండ్రులపై చైతు చూపించిన ప్రేమ అభిమానుల మనసులను హత్తుకుంటుంది. సూపర్ చై.. నీ తల్లిదండ్రులు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో చైతూ హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version