Site icon NTV Telugu

Naga Chaitanya: ‘మనం’ రీరిలీజ్.. సమంతతో పెళ్లి సీన్‌కి చిరాకు పడ్డ అక్కినేని హీరో?

Manam Re Release

Manam Re Release

Naga Chaitanya Serious on Fans at Manam Re Release Show: సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా మనం. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తో పాటు అక్కినేని నాగార్జున ఆయన కుమారుడు అక్కినేని నాగచైతన్య కూడా నటించారు. ఈ సినిమా రిలీజ్ అయిన పదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో అన్ని సినిమాల లాగానే దీన్ని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. కేవలం ఒక్కరోజు మాత్రమే స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా నిన్న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న దేవి థియేటర్లో ఈ సినిమా ఆడుతున్న సమయానికి నాగచైతన్య స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేసేందుకు ఆయన అక్కడికి వెళ్లారు.

Shankar: జనసేన కోసం అంత చేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? షకలక శంకర్ షాకింగ్ కామెంట్స్

అయితే ఈ సినిమా చూస్తున్న సమయంలో నాగచైతన్య- సమంత పెళ్లి సీను వచ్చేటప్పటికి అభిమానులు పెద్ద ఎత్తున అరుస్తూ కనిపించారు. దీంతో వారిని అరవ వద్దని నాగచైతన్య అసహనం వ్యక్తం చేస్తూ చిరాకు పడ్డ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు అందరినీ సంయమనం పాటించాలి అని కోరినట్టు చెబుతున్నారు. నిజానికి ఈ సినిమాకి విక్రమ్ కుమార్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మూడు తరాల అక్కినేని హీరోలను కలిపి చూపించిన ఘనత విక్రమ్ కుమార్ కే దక్కింది. ఇక ఈ సినిమా అప్పట్లో మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఈ సినిమాలో నాగచైతన్య సమంత ప్రేమికులుగా అలాగే భార్యాభర్తలుగా కూడా కనిపించారు.

Exit mobile version