NTV Telugu Site icon

Thandel: నాగ చైతన్య ‘తండేల్’ మొదలెట్టేశారు!

Naga Chaitanya Thandel Movie Opening

Naga Chaitanya Thandel Movie Opening

Naga Chaitanya Akkineni Thandel Movie Muhurtham Ceremony held Grandly: యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తండేల్’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. నాగ చైతన్య కెరీర్లో హయ్యస్ట్ బడ్జెట్ చిత్రమైన ‘తండేల్’ ఈరోజు గ్రాండ్ ముహూర్తం వేడుకను జరుపుకుంది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు నాగార్జున కెమెరా స్విచాన్ చేయగా, వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ‘తండేల్’ ఒక పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ.

YS Bharathi Look: యాత్ర 2 వైఎస్ భారతి లుక్ రిలీజ్.. భలే సూట్ అయిందే!

అత్యున్నత సాంకేతిక నిపుణులను ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. విజువల్ వండర్ ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తుండగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్ తీరం వెళ్లి పనిచేస్తున్న క్రమంలో వారున్న బోటు పాక్ జలాల్లోకి వెళ్లడంతో అక్కడ నేవల్ అధికారులు అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి తిరిగి ఇండియా ఎలా వచ్చారు అనే అంశం మీద ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా సాయి పల్లవి ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తోంది.