Nachinavadu Movie Na Manasu Chera Song Released”: చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కొత్త నటులు అయినా పాతవారైనా కంటెంట్ బాగుంటే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తమ లక్కు చెక్ చేసుకునేందుకు చాలా మందే ప్రయత్నాలు చేస్తున్నారు అలానే లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వయ దర్శకత్వం వహించిన మూవీ “నచ్చినవాడు”. ఏనుగంటి ఫిల్మ్ జోన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన ‘నా మనసు నిన్ను చేర’ అనే లవ్ మాస్ బీట్ సాంగ్ రిలీజ్ అయింది. యంగ్ సింగర్ యాజిన్ నిజార్ పాడగా, యువ పాటల రచయిత హర్షవర్ధన్ రెడ్డి సాహిత్యం అందించారు. ఇక ఈ సాన్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్ లో రిలీజ్ అయింది.
Gouri G. Kishan: ఎవరికీ చూపించని ప్లేస్ లో టాటూ.. ఛీ, నువ్వు కూడానా జాను అంటున్న నెటిజన్స్
ఈ క్రమంలో హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ “నచ్చినవాడు” అనే సినిమా మహిళల సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంగా చేసుకుని అల్లిన ప్రేమ కథా చిత్రం అని హాస్యానికి పెద్దపీట వేస్తూ, నేటి యూత్ కి కావాల్సిన ప్రతి అంశం ఇందులో పొందుపరిచామని, త్వరలోనే ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ సినిమాను కర్ణాటక, పాండిచ్చేరి సహా దేశంలోని వివిధ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించామని, సినిమా చాలా బాగా వచ్చిందనీ అన్నారు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందని ఆయన అన్నారు. లక్ష్మణ్ చిన్నా హీరోగా నటించిన ఈ సినిమాలో కావ్య రమేష్ హీరోయిన్ గా నటించింది.
