Naari Srinivas: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పలు పార్టీలు చిత్రసీమకు చెందిన వారిని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాయి. కొందరు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి అడుగుపెడుతుంటే… స్టార్ హీరో సుదీప్ లాంటి వారు బయట నుండి తమకు నచ్చిన అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తారు. ఇదిలాఉంటే… “బళ్ళారి దర్బార్, తుఫాన్, ఓ మై లవ్” చిత్రాలతో కన్నడలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నారి శ్రీనివాస్ అలియాస్ స్మైల్ శ్రీను. ఈయన త్వరలో జరుగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బళ్లారి విజయనగర్ జిల్లా కూడ్లీగి నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేగా నారి శ్రీనివాస్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ, ‘ఐదేళ్ళుగా బీజేపీ ఎమ్మెల్యే ఎన్. వై. గోపాలకృష్ణ నియోజకవర్గం అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేద’ని విమర్శించారు. స్వార్ధ రాజకీయాల కోసం, స్వప్రయోజనాల కోసం ప్రజలను బీజేపీ ఎమ్మెల్యే మోసం చేసినట్లు నారి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రజల సమస్యలకు పరిష్కారం లభించాలంటే కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Karnataka elections: ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బరిలోకి ఫిల్మ్ డైరెక్టర్!
Show comments