Mythri Jagadamba theatre opened today in Ghatkesar :”ఎలా అయినా నైజాం ప్రాంతంలో థియేటర్ల విషయంలో పట్టు పెంచుకోవడానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలుపెట్టి హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇక నెమ్మదిగా థియేటర్ల మీద ఫోకస్ పెట్టి థియేటర్లను రెనోవేషన్ చేస్తూ, కొన్ని థియేటర్లను నిర్మిస్తూ ముందుకు వెళుతుంది. అందులో భాగంగానే హైదరాబాద్ శివార్లలో ఉన్న ఘట్కేసర్ లో మైత్రీ జగదాంబ పేరుతో ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ ని సిద్ధం చేసింది.
ఇక ఇది హైదరాబాద్ లో సెంట్రలైజ్డ్ ఏసీతో పాటు డాల్బీ ఎట్మాస్ సౌండ్ సిస్టం ఉన్న ఫస్ట్ సింగిల్ స్క్రీన్ ధియేటర్ అని మైత్రి సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఈరోజు ఈ థియేటర్ ని ఓపెన్ చేశారు. రేపు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఈ థియేటర్ గ్రాండ్ ఓపెనింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. థియేటర్ ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. చూడడానికైతే ప్రీమియం లుక్ తో కనిపిస్తోంది.
Mythri Theatres: మరో థియేటర్ ఓపెన్ చేసేసిన మైత్రీ సంస్థ!
Show comments