NTV Telugu Site icon

Ramana Gogula: ఏదోలా ఉంది వేళా అంటూ ‘తమ్ముడు’ ను గుర్తుచేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్

Ramana Gogula

Ramana Gogula

Tammudu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో టాప్ లో నిలిచిపోయే సినిమాల్లో తమ్ముడు ఒకటి. మొట్ట మొదటి బాక్సింగ్ సినిమాగా ఈ సినిమా నచ్చి గుర్తింపు పొందింది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ సరసన ప్రీతీ జింగానియా నటించింది. ఇక పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో తమ్ముడు ఉంటుంది అనడంలో అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఈ చిత్రంలోని పాటలు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు.

పవన్- రమణ గోగుల కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు పవన్ సినిమా అనగానే సంగీతం రమణ గోగుల అని ఫిక్స్ అయిపోయేవారట. వీరి కాంబోలో వచ్చిన ప్రతి ఆల్బమ్ హిట్ టాక్ ను సొంతం చేసుకొంది. తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం.. ఇలా ఈ కాంబో అభిమానులను మెస్మరైజ్ చేస్తూ వచ్చింది. ఇక నేటితో తమ్ముడు 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను రమణ గోగుల గుర్తుచేసుకున్నారు. తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో ద్వారా తమ్ముడు 23 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలుపుతూ ఆ చిత్రంలో హిట్ సాంగ్ ‘ఏదోలా ఉంది వేళా’ గిటార్ పై వాయించారు.

“నా సంగీతం పట్ల మీ అందరికి ఉన్న ప్రేమకు ధన్యవాదాలు.. ఈ అద్భుతమైన చిత్రానికి సంగీతం అందించడానికి పవన్ కళ్యాణ్ తో నేను కూర్చొని 23 సంవత్సరాలు అయిందంటే నమ్మలేకపోతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ముందు ముందు ఈ కాంబో రరిపీట్ అవుతుందో లేదో తెలియదు కానీ.. అయితే బావుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక పవన్ తీరుస్తాడేమో చూడాలి.

Ramana Gogula latest Tweet:

Show comments