NTV Telugu Site icon

Devara: షాకింగ్.. అనిరుధ్ అవుట్.. థమన్ ఇన్.. ?

Devara

Devara

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కోలీవుడ్ లో అనిరుధ్ కు తిరుగులేదు. విక్రమ్, జైలర్, ఇప్పుడు లియో.. వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక అలాంటి అనిరుధ్ దేవరకు మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే.. అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Akkineni Nagarjuna: ఒక్క షర్ట్ రూ. 2 లక్షలా.. కింగ్ అనిపించుకున్నావ్ కదయ్యా

ఇక ఎప్ప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందా.. ? అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, కొరటాల ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న విషయం తెల్సిందే. ఒక్క షాట్ నచ్చకపోయినా కూడా వీరు సహించడం లేదట. ఇక ఈ తరుణంలోనే దేవర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అవుట్ అంటూ వార్తలు వైరల్ గా మారాయి. అనిరుధ్ మ్యూజిక్.. ఎన్టీఆర్ కు నచ్చలేదట. దీంతో కొరటాల.. అనిరుధ్ ను తప్పించి థమన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఈ వార్త మాత్రం దేవర సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ ను తీసుకొస్తుందని చెప్పుకొస్తున్నారు అభిమానులు. మరి ఇది నిజమో కాదో మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Show comments