NTV Telugu Site icon

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ తల్లితండ్రులను ఎప్పుడైనా చూశారా?

Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur Family Photo: మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ముందుగా సీరియల్స్ లో బిజీ ఆర్టిస్ట్. నెమ్మదిగా మరాఠీ సినిమాలు, హిందీ సినిమాలు చేస్తూ వస్తున్న ఆమెను ఏ ముహూర్తాన హను రాఘవపూడి చూశాడో కానీ ఠక్కున ఆమెకు సినీ హీరోయిన్ అవకాశం ఇచ్చేశాడు. అలా మృణాల్ ఠాకూర్ “సీతా రామం” సినిమాతో హీరోయిన్ గా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువా హీరో నానితో కలిసి “హాయ్ నాన్నా” సినిమాలో ఆమె హీరోయిన్ గా మారి ఆ సినిమాతో ఆమె మంచి టాలెంట్ ఉన్న నటి అని కూడా ప్రూవ్ చ్చేసుకుంది. ఒకరకంగా ఆమె మొదటి రెండు సినిమాలు హిట్ కావడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చినా అన్నీ ఒప్పుకోకుండా నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది.

YouTuber Arrested: మహిళా పోలీసులపై నోటి దురద వ్యాఖ్యలు.. యూట్యూబర్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్!

అందులో భాగంగా విజయ్ దేవరకొండలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేయగా అది పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఆమె తన సినిమాల మీద మరింత ఫోకస్ పెడుతోంది. ఆ సంగతి పక్కన పెడితే మృణాల్ ఠాకూర్ సొంత కుటుంబం గురించి చాలా మందికి తెలియదు. ఇదిలా ఉంటే, మృణాల్ ఠాకూర్ తన తల్లి, తండ్రి మరియు సోదరుడు మరియు సోదరితో ఉన్న అందమైన కుటుంబ ఫోటోను విడుదల చేసింది. ఇక ఆ పిక్ లో ఆమె తన తల్లీ తండ్రి సహా సోదరుడితో కలిసి కనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.