NTV Telugu Site icon

Tollywood: సెట్స్ మీదకెళ్ళి మూడేళ్లు.. ఇంకెప్పుడు ఈ సినిమాలకు మోక్షం?

Movies Release Dates

Movies Release Dates

Movies On Sets from 3 Years full List is here: కారణం ఏదైనా కావచ్చు. సినిమా లేటైతే ఆర్నెల్లు మహా అయితే సంవత్సరం ఆలస్యమవుతుంది. ఎట్టకేలకు కొన్ని సినిమాలు రెడీ అవుతుంటే… మరికొన్ని ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. సెట్స్‌పై మూడేళ్లు వుండిపోయిన ఆ సినిమాలు ఏమిటో చూద్దాం. మూడేళ్ల పాటు సెట్స్‌పైనే ఉంటున్న కొన్ని సినిమాలు రిలీజ్‌ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నాయి. షూటింగ్‌ ఆలస్యానికి ఒక్కొక్కరిది ఒక్కో రీజన్‌ అని చెప్పొచ్చు. విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఆలస్యం కావడంతో.. మూడేళ్లు సెట్స్‌పైనే కాలం గడిపేసింది కల్కి. ‘దేవర’లో సముద్రం మీద వచ్చే సీన్స్‌ అన్నీ విఎఫ్‌ఎక్స్‌తోనే ఉండడంతో ఆ సినిమా రిలీజ్ కూడా వాయిదా వేసుకోక తప్పని స్థితి. 2022 డిసెంబర్‌లో రావాల్సిన పుష్ప2 వాయిదా పడి ఆగస్ట్‌ 15న విడుదలకి రెడీ అవుతోంది. పుష్ప2 కథపై ఏడాది కూర్చున్న సుకుమార్‌ దాన్ని తెరకెక్కించే విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నాడు.

Baby Copy Controversy: నేను లై డిటెక్షన్‌కు సిద్దం.. సాయి రాజేష్ సిద్దమా?

ఇక ప్రభాస్‌ ఖాళీ వున్న టైంలో మాత్రమే ‘రాజాసాబ్‌’కు డేట్స్‌ ఇస్తున్న క్రమంలో రిలీజ్‌ ఎప్పుడో చెప్పలేకపోతున్నారు మేకర్స్‌. ఆ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇక ఓవర్‌ బడ్జెట్‌తో ఆగిపోయిన ‘భారతీయుడు2’ షూటింగ్‌ కమల్‌హాసన్‌ చొరవతో మళ్లీ మొదలైనా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేకపోతున్నారు. భారతీయుడు2 కోసం గేమ్‌ ఛేంజర్‌ను శంకర్‌ పక్కన పెట్టగా ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఎప్పుడొస్తాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇక మూడేళ్లుగా సెట్స్‌పైనే ‘హరిహర వీరమల్లు’ ఉండడంతో సినిమా నుంచి తప్పుకున్నాడు క్రిష్‌. రాజకీయాలతో పవన్‌ బిజీగా ఉండడంతో నిర్మాత రత్నం కొడుకుని డైరెక్టర్ గా పెట్టి బండి నడిపించాలని చూస్తున్నారు. మొత్తంగా ఈ కథా కమామీషు ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం

Show comments