ఈ మధ్య యాక్షన్ సినిమాలే కాదు.. థ్రిల్లింగ్ కథలతో వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. హీరో నవీన్ చంద్ర మొదటి నుంచి విభిన్న కథలతో అలరిస్తూ ఉంటాడు.. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్ని ఒక లెక్క.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒక లెక్క.. పాత్ర ఏదైనా నేను రెడీ అంటూ నటుడిగా మెప్పిస్తున్న నవీన్ చంద్ర ఇప్పుడు ఓటీటీ స్పేస్ లో కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.. ‘ఇన్స్పెక్టర్ రిషి’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు..
మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించగా హారర్ క్రైమ్ కథతో ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. ఎలాంటి క్లూ లేకుండా జరుగుతున్న హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నవీన్ చంద్ర ఈ వెబ్ సిరీస్ లో టైటిల్ రోల్ లో కనిపించునున్నారు . ఈ సిరీస్ కు సంబందించిన టీజర్ ప్రేక్షకులను భయపెట్టింది..
ఇప్పుడు ఈ సిరీస్ నుంచి తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. ట్రైలర్ లో సస్పెన్స్ సన్నివేశాలతో, అదిరిపోయే విజువల్స్ తో భయపెడుతున్నాయి.. అసలు మనుషులను ఎవరూ చంపుతున్నారు.. తెలుసుకొనేందుకు ఇన్స్పెక్టర్ రిషి ప్రయత్నిస్తాడు.. ఆ ట్రైలర్ ఆధ్యంతం వణుకుపుట్టిస్తుంది.. ఈనెల 29న అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.. ఈ వెబ్ సిరీస్ లో సునయన, కన్నా రవి, మాలిని జీవరత్నం, శ్రీకాంత్ దయాల్, కుమార్ వేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో నవీన్ చంద్ర ఎలెవన్, సత్యభామ వంటి ప్రాజెక్టు లలో నటిస్తున్నాడు..