Site icon NTV Telugu

తెలుగు డైలాగ్ తో అదరగొట్టిన మలయాళ స్టార్… ‘ఆరాట్టు’ టీజర్

MohanLal utters Telugu dialogues in the teaser of Aarattu

మలయాళ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆరాట్టు’. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. కేవలం 53 సెకన్ల నిడివి ఉన్న వోల్టేజ్ మాస్ కంటెంట్‌ టీజర్ తో హీరోను పరిచయం చేశారు. అయితే ఈ టీజర్లో ఒకే ఒక్క డైలాగ్ ఉండగా… అది కూడా తెలుగు డైలాగ్ కావడం విశేషం. టీజర్లో ‘నేను వాడిని చంపేస్తాను’ అంటూ విలన్ ను హెచ్చరించారు మోహన్ లాల్. దీంతో సినిమాలో తెలుగు నేపథ్యం కలిగిన విలన్ పాత్ర ఉండి ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ‘ఆరాట్టు’ చిత్రానికి బి ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించారు. మీరు కూడా ఈ పైసా వసూల్ టీజర్ ను వీక్షించండి.

ఇక మోహన్ లాల్ హీరోగానే కాకుండా పలు చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు కూడా పోషించారు. తెలుగు ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారేజ్’, చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ‘మనమంతా’ చిత్రాల్లో మోహన్ లాల్ నటించారు. మోహన్ లాల్ ‘మన్యం పులి’ చిత్రం తెలుగులో భారీ విజయం సాధించింది.

Exit mobile version