Site icon NTV Telugu

Mahesh Babu: సింహంలా గర్జించిన మహేశ్ బాబు ‘ముఫాసా’ ట్రైలర్ రిలీజ్..

Untitled Design (20)

Untitled Design (20)

2019లో వచ్చిన ది లయన్ కింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ చిత్రానికి సిక్వెల్ ముఫాసా: ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మహేశ్ తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుంబాగా తిరిగి వస్తున్నారు. మరియు అలీ టిమోన్‌గా తిరిగి వస్తున్నాడు. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ తాజగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read: Gabbar singh: ‘అన్నయ్య’ రికార్డును బద్దలు కొట్టబోతున్న ‘తమ్ముడు’..

ఇందులో ముఫాసా తెలుగు పాత్రకు మ‌హేష్‌బాబు డ‌బ్బింగ్ చెప్పారు. తెలుగు ట్రైల‌ర్‌లో మ‌హేష్ వాయిస్ అభిమానుల‌తో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మరి ముఖ్యంగా ‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి, నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే అవి మాయమవుతున్నాయి’’ అంటూ మహేశ్‌ చెప్పే డైలాగ్స్ కు గూస్‌బంప్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్‌ ఆద్యంతం అలరించేలా సాగింది. మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ‘ముఫాసా’కు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉందని ముఫాసా’కు వాయిస్‌ ఓవర్‌ అందించడంపై సూపర్ స్టార్ మహేశ్‌ ట్వీట్ చేసారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న ప్రపంచవ్యప్తంగా విడుదల కానుంది. హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్‌ ఖాన్‌ ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన తనయుడు అబ్రం వాయిస్‌ ఓవర్ అందించారు.

Exit mobile version