NTV Telugu Site icon

Bhola Shankar: దుమ్ము రేపుతున్న భోళా శంకర్ టీజర్..

Bhola Shankar

Bhola Shankar

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది.. ప్రస్తుతం అదే ఊపులో భోళా శంకర్‌ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. మెహర్‌ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇక ఇప్పటివరకు రిలీజైన పోస్టర్‌లు, లిరికల్ సాంగ్‌ కాస్త మంచి హైపే తెచ్చిపెట్టాయి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను అట్టహాసంగా చిత్ర యూనిట్ లాంచ్ చేసింది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతుంది..

టీజర్ లో చిరు విజ్రూంభించాడు..మొత్తం 33 మందిని చంపేశాడు. ఒక్కడు.. ఏకాకి.. హౌ? కోన్‌ హై తూ?’ అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. విలన్‌ ప్రశ్నకు తన మేనరిజంలో ఆన్సరిచ్చాడు చిరు. షికారుకు వచ్చిన షేర్‌ను బే అంటూ మాస్‌ డైలాగ్‌లు పలికాడు. టీజర్‌లో కీర్తి సురేశ్‌, తమన్నా, సుశాంత్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఈ వీడియోలో యాక్షన్‌ సీన్లు మరో లెవల్‌లో ఉన్నాయి.. టీజర్ చివర్లో ఈ స్టేట్ డివైడ్ అయిన మెగా ఫ్యాన్స్ తో పాటు, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..

ఈ సినిమాను భారీ యాక్షన్ కథగా తెరకేక్కిస్తున్నారు.. మెహర్ రమేష్ మరోసారి తన మార్క్ ను చూపించంభోతున్నాడు…. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తమన్నా చిరుతో జోడీ కట్టగా, కీర్తి సురేశ్‌ అతడికి చెల్లిగా నటించింది. ఏకే ఎంటర్టైన్మెంట్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు..ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ జనాల్లో హైప్ ను క్రియేట్ చేసింది.. మరి సినిమా ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..